Tirumala Srivari Dharma Rathams Free Bus Services: తిరుమలలో భక్తుల కోసం ఉచిత బస్సు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. శ్రీవారి ధర్మ రథాలు కొండపై భక్తుల సేవలో కొనసాగుతున్నాయి. ప్రతి రోజూ 300 ట్రిప్పులు అందుబాటులో ఉంటాయి.. రోజుకు 60వేలమంది భక్తులు ఈ సేవల్ని ఉపయోగించుకుంటున్నారు. భక్తులు ట్యాక్సీలకు డబ్బులు ఖర్చు చేయకుండా ఉచితంగానే ఈ బస్సుల్లో ప్రయాణం చేయొచ్చు. ఈ మేరకు టీటీడీ కొత్తగా డిస్‌ప్లే బోర్డులు ఏర్పాటు చేసింది.