నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుపాను ప్రభావంతో శనివారం ఉదయం నుంచి రాయలసీమ, కోస్తా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల రోడ్లు జలమయమయ్యాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. తుపాన్ ప్రభావంతో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, కాజ్‌వేలు మీదుగా ప్రయాణించే బస్సులను ఆర్టీసీ ముందుజాగ్రత్త చర్యలలో భాగంగా నిలిపివేసింది. ఇక, తిరుమలలో కురిసిన వర్షానికి పై నుంచి జలపాతాలు పొంగి పొర్లుతున్నాయి.