టాలీవుడ్ హీరో నితిన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శనివారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనం సమయంలో నితిన్ తన కుటుంబంతో కలిసి శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భార్య, కొడుకుతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు నితిన్. దర్శనం అనంతరం రంగనాయక మండపంలో వేదపండితులు వేదాశ్వీరచనం అందించారు. టీటీడీ సిబ్బంది పట్టువస్త్రంతో సత్కరించి, తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం శ్రీవారి ఆలయం ఎదుటకు వచ్చిన నితిన్‌తో ఫోటోలు దిగేందుకు భక్తులు పోటీపడ్డారు.