Tirumala 100 Cows Died In TTD Goshala: తిరుమల టీటీడీ గోశాలలో గత మూడు నెలల్లో 100కుపైగా ఆవులు చనిపోయాంటూ వైఎస్సార్‌సీపీ సంచలన ఆరోపణలు చేసింది. చనిపోయిన ఆవులకు సంబంధించిన ఫోటోలను ట్వీట్ చేసింది. టీటీడీ, ప్రభుత్వం ఈ విషయాన్ని బయటకు రాకుండా రహస్యంగా ఉంచినట్లు ఆరోపించారు. ఈ ఎపిసోడ్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. మరి వైఎస్సార్‌సీపీ ఆరోపించినట్లు టీటీడీ గోశాలలో 100కుపైగా ఆవులు చనిపోయాయా?.. టీటీడీ సమాధానం ఏంటి?