TTD Serious On Valluri Vamsinadh Reddy Tirumala Photo Shoot: తిరుమలలో కడప జిల్లా కమలాపురానికి చెందిన వ్యాపారవేత్త వంశీనాథ్ రెడ్డి రెచ్చిపోయారు. తన పుట్టినరోజు కావడంతో తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు.. అనంతరం టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా శ్రీవారి ఆలయం ముందు నలుగురు ప్రైవేట్ ఫొటోగ్రాఫర్లతో ఫొటోషూట్ నిర్వహించారు. ఆలయం ముందే నిలబడి ఫొటోలు, వీడియోలు తీయించుకుంటూ హల్‌చల్ చేశారు. దీంతో టీటీడీ ఈ అంశంపై స్పంందించి.. చర్యలు తీసుకుంటామని ప్రకటించింది.