TTD Decision On Tirumala Temple Veda Ashirvachanam Tickets: తిరుమల శ్రీవారి ఆలయంలో దర్శనం తర్వాత ప్రముఖులకు వేదాశీర్వచనాన్ని అందిస్తారు. అయితే టీటీడీ కొంతమందికి దర్శనంతో పాటూ వేదాశీర్వచనం టికెట్లు కూడా కేటాయిస్తారు. అయితే టీటీడీ ఈ కోటాను తగ్గించాలని నిర్ణయించిందట. తిరుమల శ్రీవారి ఆలయంలో ఇతర భక్తులకు ఇబ్బందులు ఎదురుకావడంతో టీటీడీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ టికెట్లను పూర్తిగా నియంత్రించాలని టీటీడీ నిర్ణయం తీసుకుందట.