తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతోంది. వేసవి సెలవులతో పాటుగా వారాంతాలు కావటంతో భక్తులతో తిరుమలగిరి కిటకిటలాడుతోంది. ఆదివారం తిరుమల శ్రీవారి దర్శనానికి 20 గంటల వరకూ సమయం పట్టింది. భక్తుల రద్దీ నేపథ్యంలో టీటీడీ ఏఈవో వెంకయ్య చౌదరి క్యూలైన్లలో ఏర్పాట్లు పరిశీలించారు. భక్తుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఇక టోకెన్లు, టికెట్లతో శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు.. తమకు కేటాయించిన నిర్దేశిత సమయంలోనే క్యూలైన్లలోకి ప్రవేశించాలని టీటీడీ ఏఈవో కోరారు.