తిరుమలలో వైకుంఠ ఏకాదశి పర్వదినం కోసం ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా పదిరోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించనున్నారు. జనవరి 10 నుంచి తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించనున్నారు. ఈ నేపథ్యంలో సామాన్య భక్తులకు సులభంగా వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించేలా టీటీడీ చర్యలు తీసుకుంటోంది. వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై టీటీడీ ఈవో శ్యామలరావు శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక సూచనలు చేశారు.