తిరుమల శ్రీవారి ఆలయం చెంత గోల్డ్ మ్యాన్ సందడి చేశాడు. హైదరాబాద్ ఓల్డ్ సిటీకి చెందిన సూర్యా భాయ్ అనే వ్యక్తి ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఒంటి మీద దాదాపు 8 కేజీల బంగారు ఆభరణాలు ధరించి ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. తాను వేసుకున్న చైన్ ఇండియాలో మరెవ్వరి వద్ద లేదని అన్నారు. తన అమ్మకోసం ఈ చైన్ వేసుకున్నట్లు చెప్పారు. కాగా, గోల్డ్ మ్యాన్‌తో ఫోటోలు దిగేందుకు భక్తులు పోటీ పడ్డారు.