బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాను పుదుచ్చేరి సమీపంలో శనివారం రాత్రి తీరం దాటింది. పెంగల్ ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. తిరుమలలో కురిసిన వర్షానికి శ్రీవారి ఆలయ పరిసరాలు పూర్తి జలమయమయ్యాయి. ప్రతికూల వాతావరణ నేపథ్యంలో విశాఖ, తిరుపతితో పాటు పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. కృష్ణపట్నం వద్ద సముద్రం 20 అడుగులు ముందుకు వచ్చింది. ఏపీలోని అన్ని పోర్టుల్లోనూ ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి.