సూర్యపేట జిల్లాలో గురువారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు దుర్మరణం చెందారు. కోనసీమ జిల్లా ఆలమూరుకు చెందిన ఎస్సై అశోక్, కానిస్టేబుల్ బ్లెస్సిన్ హైదరాబాద్ వెళ్తుండగా కోదాడ బైపాస్ వద్ద లారీని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఎస్సై, కానిస్టేబుల్ అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే ఇది చదవండి.