తెలంగాణ ప్రతిపాదించిన తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణానికి సంబంధించి కీలకమైన ముందడుగు పడింది. ప్రాణహిత నదిపై చేపట్టనున్న ఈ ప్రాజెక్టుపై తెలంగాణ, మహారాష్ట్ర మధ్య ఉన్న అంశాలను పరిష్కరించేందుకు కేంద్రం సెప్టెంబర్ 1న ఢిల్లీలో ఉన్నతస్థాయి సమావేశం జరగనుంది. బ్యారేజీ ఎత్తు, ముంపు, నీటి తరలింపు, విద్యుత్ వ్యయం వంటి అంశాలు భేటీలో చర్చించనున్నారు. 148 మీటర్లకు బదులుగా 152 మీటర్ల ఎత్తు కోసం తెలంగాణ చేస్తున్న ప్రయత్నం ఈ సమావేశంలో కీలకంగా మారనుంది.