తెలంగాణలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కోసం ఇక ఆధార్ కార్డు అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ)తో ఒప్పందం చేసుకుని, ప్రతి మహిళకు ప్రత్యేక కార్డులు పంపిణీ చేయనుంది. ఈ మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ లాభాల్లోకి వచ్చిందని, 255 కోట్ల ఉచిత ప్రయాణాలు జరిగాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. హైదరాబాద్‌తో పాటు వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో కూడా ఈవీ బస్సులు నడుపుతామన్నారు.