ఏపీ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయనుంది. ఆగస్ట్ 15 నుంచి స్త్రీ శక్తి పథకం అమలు చేయనుంది. ఈ మేరకు మార్గదర్శకాలు కూడా విడుదల అయ్యాయి. ఈ మార్గదర్శకాల విడుదల అనంతరం తెలంగాణ ఎఫెక్ట్‌తో ఏపీ ప్రభుత్వం ముందే మేల్కొందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణలో మహాలక్ష్మి పథకం తర్వాత తలెత్తిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఏపీ ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుందని చెప్తున్నారు.