తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియకు కేంద్ర ఎన్నికల సంఘం మూడోసారి గడువు పొడిగించింది. తాజా షెడ్యూల్ ప్రకారం తుది ఓటర్ల జాబితా నవంబర్ 9న విడుదల కానుంది. ఓటర్లు క్లెయిమ్‌లు, అభ్యంతరాలు అక్టోబర్ 7 వరకు దాఖలు చేయవచ్చు. వాటిపై నోటీసులు, విచారణలు, పత్రాల పరిశీలన నవంబర్ 5 వరకు కొనసాగుతాయి. సీఎం రేవంత్ రెడ్డి నాలుగు వారాల గడువు కోరగా.. రాష్ట్ర సీఈవో మూడు వారాల పొడిగింపును కోరారు.