తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల కొత్త ఇంఛార్జ్‌గా మీనాక్షి నటరాజన్‌ను హైకమాండ్ నియమించిన విషయం తెలిసిందే. కొత్త ఇంఛార్జ్‌గా నియమించిన తర్వాత.. మొదటిసారిగా రేపు (ఫిబ్రవరి 28న) హైదరాబాద్‌కు వస్తున్న నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పార్టీ నేతలకు, శ్రేణులకు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.