తెలంగాణ కేబినెట్ విస్తరణ మరింత ఆలస్యం.. రేవంత్ సభకు రాజగోపాల్ రెడ్డి దూరం, కారణం అదేనా..?

2 months ago 11
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రెండ్రోజుల క్రితం నల్గొండ జిల్లా కేంద్రంలో జరిగిన బహిరంగ సభకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గైర్హాజరు కావడం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండున్నరేళ్లు దాటుతున్నా.. కేబినెట్ విస్తరణ జరగకపోవటంపై రాజగోపాల్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రి పదవి ఇవ్వకుండా.. జరుగుతున్న జాప్యానికి నిరసనగా ఆయన ఈ సభకు దూరంగా ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే కుల సమీకరణాలు, ప్రాంతీయ ప్రాతినిధ్యం వంటి సవాళ్ల కారణంగానే కేబినెట్ విస్తరణ మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని పార్టీ సీనియర్ నేతలు చెబుతున్నారు.
Read Entire Article