తెలంగాణకు కొత్త గవర్నర్ వచ్చారు. ఇన్నిరోజులూ.. జార్ఖండ్‌తో పాటు తెలంగాణ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహించిన సీపీ రాధాకృష్ణన్ స్థానంలో జిష్ణు దేవ్ వర్మ నియమితులు కాగా.. ఈరోజు ప్రమాణ స్వీకారం కూడా చేశారు. అయితే.. త్రిపుర రాజవంశీయుడైన జిష్ణు దేవ్ వర్మ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్, పొలిటికల్ నేపథ్యం ఏంటీ అన్నది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఆయన గురించిన విషయాలు తెలుసుకునేందుకు తెలంగాణ ప్రజలు నెట్టింట వెతుకుతున్నారు.