తెలంగాణ జనసేనలోకి చేరికలు.. పవన్ సమక్షంలో కండువా కప్పుకున్న గడల శ్రీనివాసరావు

3 months ago 17
Gadala Srinivasa rao Joined Janasena: తెలంగాణలో జనసేన పార్టీకి నూతనోత్తేజం కలిగించే పరిణామం బుధవారం చోటుచేసుకుంది. తెలంగాణ పబ్లిక్ హెల్త్ మాజీ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు జనసేన కండువా కప్పుకున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గడల శ్రీనివాసరావుకు కండువా కప్పి జనసేనలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నచ్చి జనసేనలో చేరినట్లు గడల శ్రీనివాసరావు తెలిపారు. తెలంగాణలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. మరోవైపు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చేసిన ట్వీట్‌తోనే గడల శ్రీనివాసరావు జనసేనలో చేరతారనే వార్తలు వచ్చాయి. చివరకు అదే నిజమైంది.
Read Entire Article