తెలంగాణ జాగృతి ఒత్తిడికి ప్రభుత్వం దిగొచ్చింది.. ఇది మా విజయం, కవిత ఇంట్రెస్టింగ్ ట్వీట్

11 months ago 12
భద్రాచలం పట్టణాన్ని ఆనుకుని ప్రస్తుతం ఏపీలో అతర్భాగంగా ఉన్న ఐదు గ్రామాలను తెలంగాణలో తిరిగి విలీనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హర్షం వ్యక్తం చేశారు. ఇది ఆ ఐదు గ్రామాల ప్రజలు, తెలంగాణ జాగృతి సాధించిన విజయమని ఆమె ట్వీట్ చేశారు. ఐదు గ్రామాల ప్రజలు విద్య, వైద్యం వంటి అవసరాల కోసం నిత్యం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కవిత పేర్కొన్నారు. వారి దుస్థితిపై తెలంగాణ జాగృతి ఈ నెల 20న నిర్వహించిన 'పోలవరం - తెలంగాణపై జలఖడ్గం' రౌండ్ టేబుల్ సమావేశం తర్వాతే రాష్ట్ర ప్రభుత్వంలో కదలిక వచ్చిందని ఆమె తెలిపారు.
Read Entire Article