Telangana Digital Media Director: తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొణతం దిలీప్‌ను సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. బీఆర్ఎస్ ఐటీ విభాగంలో కీలక బాధ్యతలు పోషించిన కొణతం దిలీప్‌ను సైబర్ క్రైం పోలీసులు ఉన్నట్టుండి అరెస్ట్ చేయటం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కాగా.. దిలీప్ అరెస్ట్‌ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. దిలీప్‌ను వెంటనే విడుదల చేయాలంటూ కేటీఆర్ డిమాండ్ చేశారు.