అత్యంత సామాన్యమైన కుటుంబంలో జన్మించి.. ఏదైనా అసాధారణ పని చేసి సమాజంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చుకున్నాడు తెలంగాణ డ్రిల్ మ్యాన్ క్రాంతి కుమార్. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడురుకు చెందిన క్రాంతి కుమార్.. ప్రపంచంలో ఎవరూ చేయలేని సాహసాలు చేసి.. గిన్నిస్ బుక్‌లో స్థానం సంపాదించుకున్నాడు. అయితే. ఒకే వేదికపై నాలుగు వేరువేరు సాహాసాలు చేసి.. ఒకేసారి నాలుగు రికార్డులు సొంతం చేసుకుని అందరి ప్రశంసలు పొందుతున్నాడు.