ktr emotional tweet: తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో భారీ పెట్టుబడులతో వచ్చిన కంపెనీలు.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా వేరే రాష్ట్రాలకు తరలివెళ్తున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే ఫ్యాక్స్ కాన్ కంపెనీ కర్ణాటకకు తరలివెళ్లిపోగా.. ఇప్పుడు మరో కంపెనీ గుజరాత్‌కు తరలివెళ్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఓ ప్రముఖ దినపత్రికలో వచ్చిన కథనాన్ని కోట్ చేస్తూ.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ట్విట్టర్‌లో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.