తెలంగాణ గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికల సందడి నెలకొంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో గుర్తులు లేకుండానే అభ్యర్థులు ప్రచారం కొనసాగించారు. అయితే మొదటి విడత పోలింగ్‌కు సంబంధించి డిసెంబర్ 3 వరకు ఉన్న నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో.. పోటీలో మిగిలిన వారికి గుర్తుల కేటాయించారు. తెలుగు అక్షర క్రమం ఆధారంగా గుర్తులు కేటాయించారు. ఈ ఎన్నికల కోసం రోజువారీ వినియోగించే వస్తువులకు సంబంధించిన 30 గుర్తులను ఎన్నికల సంఘం కేటాయించింది.