తెలంగాణ ప్రభుత్వం 2026-27 పత్తి కొనుగోలు సీజన్‌ను ఈసారి సెప్టెంబరు నుంచే ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ సీజన్‌లో 46.33 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయగా.. సుమారు 25.85 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. రైతుల అనుకూలత కోసం 131 కొనుగోలు కేంద్రాలు, 356 జిన్నింగ్ మిల్లులను సిద్ధం చేస్తున్నారు. కపాస్ కిసాన్ యాప్ ద్వారా స్లాట్ బుకింగ్‌ను సరళతరం చేయడంతో పాటు సమస్యల పరిష్కారానికి టోల్‌ఫ్రీ, వాట్సప్ చాట్‌బాట్ సేవలను అందుబాటులోకి తేనున్నారు.