తెలంగాణ పల్లెలకు కేంద్రం తీపి కబురు చెప్పింది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు తెలంగాణ సహా ఆరు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం రూ. 1,500 కోట్లకు పైగా గ్రాంట్లను విడుదల చేసింది. ఇందులో భాగంగా తెలంగాణ పంచాయతీరాజ్ సంస్థలకు రూ. 247.94 కోట్ల అన్‌టైడ్ గ్రాంట్స్ కేటాయించారు. ఈ నిధులతో రాష్ట్రంలోని 12600 గ్రామ పంచాయతీల్లో మౌలిక సదుపాయాల కల్పన జరగనుంది. జీతాలకు కాకుండా కేవలం అభివృద్ధి పనులకే ఈ నిధులను వినియోగించాలని కేంద్రం నిబంధన విధించింది.