తెలంగాణ పోలీస్ ఉద్యోగార్థులకు గుడ్‌న్యూస్.. కానిస్టేబుల్ పోస్టులకు వయోపరిమితి పెంపు

1 month ago 9
తెలంగాణలో పోలీస్‌ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న నిరుద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. పోలీస్‌, ఫైర్‌, జైళ్లు, స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌లోని కానిస్టేబుల్‌, సమాన స్థాయి పోస్టులకు గరిష్ఠ వయోపరిమితిని మరో మూడేళ్లు పెంచింది. ఇప్పటికే ఇచ్చిన ఏడేళ్ల సడలింపునకు ఇది అదనంగా వర్తిస్తుంది. అయితే కానిస్టేబుల్ డ్రైవర్‌ పోస్టులకు తాజా పెంపు వర్తించదు. మరోవైపు 7,437 పోలీస్‌ ఉద్యోగాల దరఖాస్తు గడువును సెప్టెంబర్‌ 16 వరకు పొడిగించారు. దీంతో వేలాది మంది అభ్యర్థులకు మరింత అవకాశం లభించింది.
Read Entire Article