తెలంగాణ ప్రజలకు చల్లని కబురు.. ఎండల నుంచి రిలీఫ్, ఈ జిల్లాల్లో నేడు వర్షాలు

4 months ago 20
తెలంగాణకు హైదరాబాద్ వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది. నేడు, రేపు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. అదే సమయంలో గాలిలో తేమ శాతం 22 శాతానికి పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. దీనివల్ల ఉష్ణోగ్రతల ప్రభావం రెట్టింపు కావడమే కాకుండా.. వడదెబ్బ మరణాలు సంభవిస్తున్నాయని వాతావరణశాఖ నిపుణులు చెబుతున్నారు. పట్టణీకరణ, కాలుష్యం వల్ల వాతావరణంలో మార్పులు వస్తున్నాయని, ప్రజలు ముఖ్యంగా వృద్ధులు, రోగులు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అకాల వర్షాలుు, వేడి గాలుల పట్ల అప్రమత్తత అవసరమని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
Read Entire Article