Secunderabad Vasco Da Gama New Biweekly Train To Start In A Week:తెలుగు రాష్ట్రాల నుంచి గోవా వెళ్లే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సికింద్రాబాద్ నుంచి వాస్కోడగామా (గోవా) వెళ్లేందుకు కొత్త ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలెక్కబోతోంది. సికింద్రాబాద్-వాస్కోడగామా (గోవా) మధ్య బైవీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలును మరో వారంలో ప్రారంభించాలని నిర్ణయించారు. త్వరలోనే రైలుకు సంబంధించిన ఛార్జీలను కూడా వెల్లడించనున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.