తెలంగాణలోని ప్రతి ఇంటికి డిజిటల్ సేవలు అందించడమే లక్ష్యంగా రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. టీ-ఫైబర్ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సౌకర్యం కల్పించనున్నారు. రూ. 300కే గ్రామీణ ప్రాంతాల్లోని ఇళ్లకు ఇంటర్‌నెట్ కనెక్షన్ ఇవ్వనున్నారు. తొలి దశలో 2,096 గ్రామాల్లో అందుబాటులోకి రానుండగా.. డిసెంబర్ 8న సీఎం రేవంత్ ప్రారంభించనున్నారు.