Skill University Board Meeting: తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన కీలక భేటీలో ఏపీ సీఎం నారా చంద్రబాబు కోడలు బ్రాహ్మణి పాల్గొన్నారు. సచివాలయంలో స్కిల్ యూనివర్సిటీ బోర్డుతో నిర్వహించిన సమావేశంలో ప్రభుత్వ పెద్దలు, స్కిల్ యూనివర్సిటీ బోర్డు సభ్యులు, బడా బడా పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. కాగా.. ఇదే మీటింగ్‌లో బ్రాహ్మణి కూడా పాల్గొనటం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే.. స్కిల్ యూనివర్సిటీలో బ్రాహ్మణికి కీలక బాధ్యతలేమైనా అప్పగిస్తారా అన్న చర్చ తెరపైకి వచ్చింది.