తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రమాదకరమైన పారాక్వాట్ డైక్లోరైడ్ 24% SL రసాయన పురుగుల మందుపై తక్షణ నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మానవ, జంతువుల ఆరోగ్యంపై ఈ రసాయనం చూపుతున్న తీవ్ర దుష్ప్రభావాలను పరిగణనలోకి తీసుకుని ఫెస్టిసైడ్స్ యాక్ట్ 1968 ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ మందు అమ్మకాలు, నిల్వ, వినియోగాన్ని ప్రభుత్వం పూర్తిగా నిషేధించింది. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఉత్తర్వుల్లో హెచ్చరించింది.