తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన ఈ బిల్లు దేశానికి స్ఫూర్తిదాయకం: హైదరాబాద్ సీపీ సజ్జనార్

1 month ago 7
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ కేబినెట్ 'తల్లిదండ్రుల మద్దతు బిల్లు'కు ఆమోదం తెలిపింది. వృద్ధాప్యంలో కన్నవారిని నిర్లక్ష్యం చేసే ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగుల వేతనాల నుంచి 10 శాతం లేదా గరిష్టంగా రూ. 10 వేలను నేరుగా తల్లిదండ్రులకు చెల్లించేలా ఈ చట్టాన్ని రూపొందించారు. ఈ నిర్ణయంపై సీనియర్ ఐపీఎస్, హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ హర్షం వ్యక్తం చేశారు. ఇది దేశానికే స్ఫూర్తిదాయకమని, వృద్ధ తల్లిదండ్రుల ఆత్మగౌరవాన్ని కాపాడే భరోసా అని ట్విట్టర్ వేదికగా కొనియాడారు.
Read Entire Article