తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో భాగంగా.. పలువురు మాజీ పోలీసు ఉన్నతాధికారులను అరెస్టు చేసి జైలుకు పంపించగా.. మొదట అరెస్టయిన తిరుపతన్నకు సుప్రీం కోర్టు షరతులతో కూడా బెయిల్ మంజూరు చేసింది. ఇప్పటికే పలుమార్లు బెయిల్ కోసం పిటిషన్లు దాఖలు చేయగా రిజెక్ట్ అవుతూ వస్తున్నాయి. కాగా.. తిరుపతన్నకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.