తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఎప్పుడెప్పుడా అని అటు ఆశావాహులు, ఇటు కాంగ్రెస్ శ్రేణులు ఎదురుచూస్తున్న నేపథ్యంలో.. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన అందరిలో ఉత్కంఠను రేకెత్తిస్తోంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి సడెన్‌గా ఢిల్లీకి వెళ్లటంతో కేబినెట్ విస్తరణ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ క్రమంలో.. రేసులో ఉన్న రేసుగుర్రాలు ఎవరన్నది ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది.