తెలంగాణలో ఇందిరా మహిళాశక్తి పథకం కింద ఉచిత చీరల పంపిణీ నవంబరు 19న ప్రారంభం కానుంది. హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. రూ.334 కోట్లతో 95 లక్షల మంది మహిళలకు చీరలు అందించాలని లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటికే 65 లక్షల చీరల తయారీ పూర్తయింది. ఆధార్ ధ్రువీకరణతో ప్రత్యేక యాప్ ద్వారా పంపిణీ చేయనున్నారు.