తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ మరో ప్రతిష్టాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయటమే లక్ష్యమని చెప్తున్న రేవంత్ రెడ్డి సర్కార్.. ఆ దిశగా రకరకాల కార్యక్రమాలను చేపడుతోంది. అయితే.. అధికారంలోకి వచ్చిన వెంటనే.. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించిన రేవంత్ రెడ్డి సర్కార్.. ఇప్పుడు అదే బస్సులకు మహాలక్ష్ములను ఓనర్లను చేయాలని సంకల్పించింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది.