తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా కసరత్తు వేగవంతం చేసింది. ఈ మేరకు ఎస్ఈసీ.. జిల్లాల కలెక్టర్లతో విస్తృత సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో జనవరి 24 లేదా 27న నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా, మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఇప్పిటికే మేయర్, చైర్‌పర్సన్ పదవుల రిజర్వేషన్లు ఖరారు చేశారు. పోటీకి సంబంధించి మార్గదర్శకాలు కూడా విడుదలయ్యాయి.