తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని యువతకు అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలను అందించేందుకు అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ కేంద్రాలను (ఏటీసీ) ఆధునీకరిస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా 2 లక్షల మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. టాటా గ్రూపు సహకారంతో ఈ శిక్షణ కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయి.