తెలంగాణ యువతకు ఇండియన్ ఆర్మీ శుభవార్త చెప్పింది. ఈ నెల 10వ తేదీ నుంచి అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. నవంబర్ 22వ తేదీ వరకు ఈ ర్యాలీ ఉంటుందని అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు పాల్గొనాలని తెలిపింది. హన్మకొండ జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో ఈ ర్యాలీలో నిర్వహించనున్నారు. తెలంగాణలోని 33 జిల్లాల అభ్యర్థులు ఈ ర్యాలీలో పాల్గొనేందుకు అవకాశం కల్పించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.