తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన 'తెలంగాణ రైజింగ్ - 2047' దార్శనికతకు అంతర్జాతీయంగా గుర్తింపు లభించింది. యూకే మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ ఈ విజన్‌ను ప్రశంసిస్తూ రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్న ఈ ప్రణాళికపై టోనీ బ్లెయిర్ ప్రశంసలు కురిపించారు. దీని రూపకల్పనకు టీబీఐజీసీ సహకారం అందించనుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.