తెలంగాణ వ్యాప్తంగా 2025-26 ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోళ్లు పూర్తయినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారులు వెల్లడించారు. దొడ్డు రకం ధాన్యానికి మద్దతు ధర అందించటంతో పాటు సన్న రకం ధాన్యానికి రూ.500 బోనస్ రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 7.49 లక్షల మంది రైతులు సన్న ధాన్యాన్ని విక్రయించగా ఇప్పటికే అకౌంట్లలో డబ్బులు జమ అయ్యాయన్నారు.