తెలంగాణలో వానాకాలం సీజన్‌కు గానూ రైతు భరోసా నిధుల విడుదలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపారు. ఎకరానికి రూ.6 వేల చొప్పున 1.50 కోట్ల ఎకరాల కోసం రూ.9 వేల కోట్లను విడుదల చేయాలని నిర్ణయించారు. జూన్ 18న జరిగే మంత్రిమండలి సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకోనుండగా.. జూన్ 26న తొలి విడతగా 73 లక్షల మంది రైతులకు నిధులు జమ కానున్నాయి. దీనితో పాటు 7 రకాల సన్న వడ్ల విత్తనాలను సబ్సిడీపై అందించాలని, విత్తనం నాటినప్పటి నుండి ధాన్యం కొనుగోళ్ల వరకు పర్యవేక్షించేందుకు ఉన్నతాధికారుల కమిటీని ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు.