తెలంగాణ ప్రభుత్వం రైతులకు తీపి కబురు చెప్పింది. ఇప్పటికే మూడు విడతల్లో రైతు రుణమాఫీ జరగ్గా.. తాజాగా నాలుగో విడత మాఫీ నిధులు విడుదలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 3,13,897 మంది రైతు కుటుంబాలకు రూ.2 లక్షల రుణమాఫీ వర్తింపజేస్తూ అందుకు అవసరమైన 2747.67 కోట్ల నిధులను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు.