తెలంగాణ ప్రభుత్వం రూ.2 లక్షల రైతు రుణమాఫీని మూడు విడతల్లో అన్నదాతల ఖాతాల్లో జమ చేసిన సంగతి తెలిసిందే. అర్హతలు ఉన్నా కొందరు రైతుల ఖాతాల్లో ఇప్పటికీ మాఫీ డబ్బులు జమ కాలేదు. అటువంటి రైతులు తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 3 లక్షల మంది ఉన్నట్లు గుర్తించారు. ఆయా రైతులకు నాలుగో విడతగా రైతు రుణమాపీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. నేడు మహబూబ్‌నగర్ రైతు పండగ సభ వేదికగా సీఎం రేవంత్ కీలక ప్రకటన చేయనున్నారు.