తెలంగాణ రైతులకు రేవంత్ రెడ్డి సర్కార్ మరో శుభవార్త చెప్పింది. సన్న వడ్లు పండించిన రైతులకు ఇస్తానన్న బోనస్ డబ్బులను విడుదల చేసింది. వానాకాలం సీజన్‌కు సంబంధించి రైతులు పండించిన సన్న వడ్లకు బోనస్ కోసం రూ.514.36 కోట్ల నిధులను రిలీజ్ చేసింది. రైతులు సన్న వడ్ల సాగును పెంచేందుకు రేవంత్ రెడ్డి సర్కార్.. ఒక్కో క్వింటాల్‌కు కనీస మద్దతు ధర కాకుండా అదనంగా రూ.500 అందిస్తోంది.