మొన్న తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై కేసీఆర్ తీవ్ర విమర్శలు చేశారని సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. రూ. 3,04,965 కోట్లతో 2025-2026 వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. దీనిపై బీఆర్ఎస్ నాయకులు తీవ్ర విమర్శలు చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. దీనిపై కేసీఆర్ కూడా విమర్శలు చేసినట్లు వైరల్ అవుతున్న వీడియో ఎంత వరకు నిజం..? అనేది ఇక్కడ తెలుసుకోండి.