తెలంగాణలో ఇప్పటికే వైరల్ ఫీవర్లు హడలెత్తిస్తుండగా.. తాజాగా స్వైన్ ఫ్లూ కేసులు కలకలం రేపుతోన్నాయి. హైదరాబాద్‌లో తాజాగా 5 స్వైన్ ఫ్లూ కేసులు బయటపడ్డాయి. చాలా ఏళ్ల తర్వాత స్వైన్ ఫ్లూ కేసులు బయటపడటంతో ప్రజల్లో ఆందోళన మెుదలైంది. దీంతో డాక్టర్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు.