తెలంగాణకు మురసు తుపాను ముప్పు ముంచుకొస్తుంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నల్గొండ, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. ఈ మేరకు ఆ రెండు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఇక సూర్యాపేట, మహబూబ్‌నగర్, వనపర్తి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కొన్ని ప్రాంతాల్లో 20 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశముందని అధికారులు వెల్లడించారు.