తెలంగాణలో ఫ్యూచర్‌సిటీ ఏర్పాటు కోసం యాచారం, కందుకూరు మండలాల పరిధిలో ప్రభుత్వ, అసైన్డ్ భూములతో భారీ భూ బ్యాంక్‌ను సిద్ధం చేస్తున్నారు. గ్లోబల్ సమ్మిట్‌కు ముందు పెట్టుబడిదారులకు భూమిని తక్షణమే అప్పగించే లక్ష్యంతో అధికారులు గూగుల్ మ్యాప్స్ ద్వారా భూములను గుర్తిస్తున్నారు. అయితే, పేదలకు జీవనోపాధి కోసం పంపిణీ చేసిన అసైన్డ్ భూములను తిరిగి తీసుకుంటారనే భయంతో.. ఆయా ప్రాంతాల రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి